Friday, September 19, 2025

పార్టీ మార్పుపై 2, 3 రోజుల్లో చెబుతా: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై రెండు, మూడు రోజుల్లోనే తన నిర్ణయం ప్రకటిస్తానని, ఎక్కువ సమయం తీసుకోనని వివరించారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై అధికారికంగా హైదరాబాద్‌లోనే చెబుతానని స్పష్టం చేశారు. తాను ఓ పార్టీలో చేరుతానని బిఆర్‌ఎస్ నేతలు ఊహించి ఉండరని, మందు పార్టీలు, పండుగ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. తన అభిమానుల నిర్ణయమే తన నిర్ణయమని స్పష్టం చేశారు. అభిమానులు, కార్యకర్తల సమక్షంలోనే తాను కొత్త పార్టీలో చేరుతానన్నారు. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం బహిరంగా సభ తేదీలను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.

Also Read: శంషాబాద్ లో ప్రియురాలిని చంపి మ్యాన్‌హోల్‌లో పడేశాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News