Monday, June 17, 2024

సాక్షి ప్రతికలో ప్రకటనలు ఇచ్చి ప్రజా సొమ్ము వృధా: పుల్లారావు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మార్గదర్శికి 60 ఏళ్లుగా మచ్చలేని చరిత్ర అని టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వినుకొండలో ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు. మార్గదర్శిపై కేసులు పెట్టి వేధించడం అన్యాయం అని మండిపడ్డారు. ఖాతాదారుల ఫిర్యాదు లేకుండానే కేసులు పెట్టారని, ఫిర్యాదు లేకుండానే కేసు పెట్టడం వైసిపి పైశాకత్వానికి నిదర్శమని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్ పాడిన తక్షణమే డబ్బు చెల్లించే సామర్థ్యం ఆయనకు ఉందన్నారు. సాక్షి ప్రతికలో ప్రకటనలు ఇచ్చి ప్రజా సొమ్మును వృథా చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు దుయ్యబట్టారు. దేశంలో విశ్వసనీయ ఉన్న కంపెనీల్లో మార్గదర్శి ఒకటి అని, వైసిపి ప్రభుత్వ పతనం దగ్గర పడిందన్నారు.

Also Read: చివరి నిజాం మనుమడు కన్నుమూత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News