మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట మాఫీ ప్రక్రి య గురువారం నుంచి ప్రారంభమైంది. ఆర్థ్ధిక శాఖ రుణమాఫీ కోసం రూ.167.59కోట్లు విడుదల చేసిం ది. బ్యాంకుల్లో పంట రుణాల బకాయి రూ.37వేల నుంచి 41వేల ఉన్న ఖాతాలకు నిధులు జమ చేసింది. దీం తో తొలిరోజే రాష్ట్రంలో 44,870 మంది రైతులు రుణ వి ముక్తులయ్యారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట మాఫీని పూర్తిచేయనున్నట్టు సిఎం కెసిఆర్ బుధవా రం ప్రకటన చేసిన 24గంటల్లోనే మాఫీ ప్రక్రియ అమల్లో కి వచ్చింది. రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సిఎం కెసిఆర్ తు.చ తప్పకుండా నెరవేర్చారు. రైతులకు 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు. 2014లో ఇచ్చిన హామీ మేరకు రూ.36వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని,
మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. రుణాల చక్రబంధంలో ఇరుక్కొని రైతులు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. అందుకే రైతులను రుణ విముక్తి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పంట రుణాల మాఫీని అమలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లోనే రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. ఈసారి సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. తొలి రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజా రుణమాఫీని కూడా కలిపితే ఇది సుమారు రూ.36 వేల కోట్లకు చేరనున్నది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.