Tuesday, September 16, 2025

సిఎం కెసిఆర్‌కు ట్రెసా నాయకుల కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ట్రెసా నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి నాయకత్వంలో ట్రెసా ప్రతినిధులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి బుధవారం మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల గురించి ట్రెసా నాయకులను అడిగి తెలుసుకున్నారు. వంద మంది తహసీల్దార్‌లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందులకు ముఖ్యమంత్రికి ట్రెసా నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, నిజా మాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి చరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైదులు, తహసీల్దార్లు హరదీప్ సింగ్, జ్ఞానజ్యోతి, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News