Sunday, April 28, 2024

అవినీతి ప్రభుత్వానికి పతనం తప్పదు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అవినీతి, అహంకార పూరిత, నియంతృత్వ పూరిత ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళంలో పాల్గొనేందుకు చేవెళ్లకు విచ్చేసిన ఆయనకు, బండి సంజయ్ కు స్థానిక కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ ఎత్తున హాజరైన కార్యకర్తలకు ఓపెన్ టాప్ జీప్ ఎక్కి అభివాదం చేస్తూ సమావేశానికి మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కర్నాటక ఎమ్మెల్యే చంద్రప్పలతో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే..

జర్నలిస్టులు, యువత, రైతులు, మహిళలు, డాక్టర్లు, కార్మికులు.. ఇలా సకలజనులు సమ్మెచేసి తెలంగాణ సాధించుకుంటే.. నాతోనే తెలంగాణ వచ్చిందని చెబుతూ.. ఉద్యమకారులను అవమాన పరుస్తున్న నాయకుడు కెసిఆర్ అని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో బిజెపి నేతృత్వంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ముట్టడి చేస్తుంటే ప్రజలపై, బిజెపి కార్యకర్తలపై పోలీసు దమనకాండ కొనసాగిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఆగస్టు 24న రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు ఘెరావ్ కార్యక్రమం.. 25న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నట్టేట ముంచిన బిఆర్‌ఎస్‌కు ఓటేస్తారా? : బండి
క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో… బిఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ంతకంటే డేంజర్… ప్రజలారా ఆలోచించండి…”అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. మూడోసారి వస్తే ఇక అంతే.. .బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను చూస్తే దండుపాళ్యం ముఠా గుర్తుకొస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర నాయకులు అశ్వధ్దామరెడ్డి. కంజర్ల ప్రకాశ్, జంగారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, శ్రీకాంత్ రెడ్డి, నరేందరెడ్డి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News