Sunday, May 12, 2024

చంపినవారికి చంపించినవారికి శిక్ష పడేలా చేయాల్సింది జగనే: సునీతా

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగనన్న ఒక పశ్న అడుగుతున్నా అంతఃకరణ శుద్ధిగా అంటే అర్థం తెలుసా? అని వైఎస్ సునీతా ప్రశ్నించారు. మా నాన్న మన నుంచి దూరమై ఐదేళ్లు అయిందని తెలిపారు.దివంగత వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్థంతి సందర్భంగా శుక్రవారం కడపలో జరిగిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. వివేకాకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిసున్నప్పుడే జగన్ సిఎం అయ్యారని, ప్రజలందరికీ న్యాయం చేస్తానని జగనన్న ప్రమాణ స్వీకారం చేశారని, జగనన్న ప్రమాణ స్వీకారం చూసి మనమంతా గర్వపడ్డామన్నారు. వివేకాను చంపినవారికి, చంపించినవారికి శిక్షపడేలా చేయాల్సిన బాధ్యత జగన్‌కు ఉందన్నారు.

నేరస్థులకు శిక్షపడాలని పోరాడుతున్న తనపై నిందలు మోపుతారా? అని సునీతా ప్రశ్నించారు. 2009లో జగనన్న రాజకీయాల్లోకి రావాలనుకున్నారని, 2009లోనే వివేకానందా రెడ్డి రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకున్నారని, ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని వివేకా నిత్యం ఆలోచించేవారని గుర్తు చేశారు. తాను అమెరికాలో చదివేటప్పుడు అక్కడికొచ్చి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ ఉండేవారు కాదు అని, వివేకా జీవితాంతం దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కోసం పని చేశారని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News