Friday, November 1, 2024

ఆప్ నాయకుడు దుర్గేశ్ పాఠక్ ను ప్రశ్నించిన ఈడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  (ఈడి) మార్చి 21న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా తాజా పరిణామం చోటుచేసుకుంది. ఈడి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ ను ప్రశ్నిస్తున్నది. లిక్కర్ స్కామ్ లో అసలు సూత్రధారి(కింగ్ పిన్) కేజ్రీవాల్ అని ఈడి పదేపదే అంటోంది.

ఈడి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఏ దుర్గేశ్ పాఠక్ కూడా సమ్మన్లు పంపింది. సోమవారం విచారణకు హాజరు కమ్మన్నది ఆ సమ్మన్ల సారాంశం. లిక్కర్ స్కామ్ లో మరి నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఈడి అరెస్టు చేయనున్నదని ఢిల్లీ మంతి ఆతిషి అన్నాక ఈ సమ్మన్లు పాఠక్ కు అందాయి. ఆతిషి తన మంత్రి మండలి సహచరులు సౌరభ్ భరద్వాజ్, పాఠక్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ ఛధ ను అరెస్ట్ చేయొచ్చని ఇటీవల అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News