Sunday, June 16, 2024

నా వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు : స్వాతి మాలీవాల్

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన సంఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. జ తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎక్స్ వేదికగా స్వాతిమాలీవాల్ ఆరోపించారు. ఆప్ సీనియర్ నేత ఒకరు నిన్న తనకు కాల్ చేశారని , స్వాతిపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ ఆప్ పార్టీ లోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. నాకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారని, నాకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించేందుకు కొందరిని ఏర్పాటు చేశారని తెలిసిందని ఆమె పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసే బాధ్యతను ఇంకొందరికి అప్పగించారని, రిపోర్టర్లను కొట్టి నాపై నకిలీ స్టింగ్ ఆపరేషన్లు చేయించాలని చూస్తున్నారని స్వాతి ఆరోపించారు. నిందితుడు చాలా శక్తివంతమైన వ్యక్తి అని, పార్టీలో బడా నేతలు కూడా ఆయనకు భయపడతారని ఆరోపించారు. ఏదేమైనా తాను ఒంటరిగా న్యాయం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కేసులోఅరెస్టయిన బిభవ్‌ను ఢిల్లీ పోలీస్‌లు మంగళవారం ముంబై తీసుకెళ్లారు. అక్కడ అతడి ఐఫోన్ డేటాను రికవర్ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. సీఎం నివాసం నుంచి పోలీస్‌లు స్వాధీనం చేసుకున్న నిందితుని ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సిసిటివి రికార్డులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News