Monday, May 5, 2025

పంజాబ్ కింగ్స్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

లక్నోపై 37 పరగులతో గెలుపు
ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగు

ధర్మశాల: ఐపిఎల్ 18లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లక్నో సూపర్ జాయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగులు తేడా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటిం గ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 236 పరుగులు భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్(91), శ్రేయా స్ అయ్యార్(45), శశాంక్ సింగ్ (35)లు బ్యాట్ ఝలిపించడంతో లక్నోకు భారీ లక్షాన్ని నిర్ధేశించింది పంజాబ్. అనంతరం లక్ష ఛేదనకు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 199 పరగులు చేసింది. దీంతో ఈ ఓటమిని మూటగట్టుకుంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బడో నీ(74), అబ్దుల్ సమద్(45)లు తప్ప మరెవరూ రాణించలేకపోయారు. ఇక ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News