రూ.2లక్షల కోట్లు ఖర్చు..అయినా పూర్తి కాని
ప్రాజెక్టులు లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం
కట్టారు..వెయ్యి ఎకరాలకూ నీళ్లు ఇవ్వలేదు
మట్టి పరీక్షలు లేకుండానే కాళేశ్వరం నిర్మాణం
కట్టిన మూడేళ్లకే కూలిన కాళేశ్వరం ప్రాజెక్టు
50,60ఏళ్ల క్రితం కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులే
ఇప్పటికీ నీళ్లు ఇస్తున్నాయి ఇంజనీర్లు ఎవరి
ఒత్తిడికి తలొగ్గవద్దు ప్రాధాన్యత క్రమంలో
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మా సంకల్పం
ఉద్యోగ నియామక పత్రాల అందజేత
కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నదే కాంగ్రెస్ ప్రభు త్వ సంకల్పమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అ న్నారు. బుధవారం కొలువుల పండగలో భాగం గా జలసౌధలో జరిగిన కార్యక్రమంలో 244 మం ది ఇంజినీర్లు, 199 మంది టివోలకు ఉద్యోగ ని యామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఆత్మగౌరవం తో బతకడానికి వీలైన పరిస్థితులు కల్పించడానికి మీరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కోరారు. మీరంతా వ్యవసాయకుటుంబంలోంచి వచ్చిన వారే ఈ రోజు ఉద్యోగాల్లో చేరుతున్నారు.
మీ నియామక పత్రాలు మీ ఇంటివద్దకే పంపించవచ్చు కానీ, మీతో ఇక్కడకు వచ్చిన మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కా వాలనే చిత్తశుద్ది తో పనిచేయాలని పిలుపునిస్తూ వారందరికి అభినందనలు తెలియజేశారు. ఇది ఉ ద్యోగం కాదు, ఒక భావోద్వేగం, ఈ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు అని అన్నారు. నీళ్లు మన నాగరికత, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, నీళ్ళ కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాదించి పెట్టిందన్నారు. భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయని, రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. నిధులు పారాయి కానీ నీళ్లు పారలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చి పదేండ్లు అయినా ఆ ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు.
ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో మేధావులు, ఉద్యోగులు ఆలోచన చేయాలని కోరారు. అందుకే ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న సంకల్పంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నమని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లోనే ఒక్క నీటిపారుదల శాఖ పరిధిలోనే 1,161 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఆనాడు తొలి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రు ఇరిగేషన్, ఎడ్యుకేషన్ అంశాలకు ప్రాధాన్య ఇచ్చారని, నాడు పండిత్ నెహ్రు తీసుకున్న నిర్ణయాలు, పూర్తిచేసిన ప్రాజెక్టులతోనే ఈరోజు ప్రపంచదేశాల ముందు ఆత్మగౌరవంతో దేశాన్ని నిలబెట్టిందన్నారు. ఆనాడు బాక్రానంగల్ డ్యామ్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టు తొలిప్రధాని మొదలు పెట్టినవేనన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు ఎన్నో ప్రాజెక్టు కట్టారు. 1908లో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల ప్రాజెక్టులను చూడండి, అవి నిటారుగా నిలబడ్డాయి, కానీ గత పాలకులు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని విమర్శించారు. లక్షా రెండువేల కోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు.
కాళేశ్వరం నుంచి నికరం యాబై వేల ఎకరాలకు కూడా ఇవ్వలేకపోయారు. కట్టిన మూడేండ్లలోనే కుప్పకూలిన ప్రాజెక్టు ఈ భూ ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు. విధుల్లోకి చేరాక పాత నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులను కూడా చూడాలని వారికి సూచించారు. ప్రాజెక్టులను ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనేదానికి కాళేశ్వరం ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్(మట్టి నమూనాలు) టెస్టులు కూడా చేయలేదని తెలిపారు. 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజినీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థతి ఇది అని అన్నారు. ఇంజినీర్ల పని ఇంజినీర్లే చేయాలి, రాజకీయ నాయకుల పని రాజకీయనాయులు చేయాలని, పరిమిత జ్ఞానంతో రాజకీయనేతల మాటలు మాటలు నమ్మి ఇంజినీర్లు ఏవైనా చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంజినీర్లు తమ విచక్షణతో పనిచేయాలని కోరారు. తెలంగాణ ప్రజలకు బిగ్గెస్టు సెంటిమెంట్ నీళ్లు అని, 75 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది.
ఎవరి నిర్లక్షం వల్ల ఎస్‌ఎల్‌బిసి పూర్తి కాలేదో అందరికీ తెలిసునని, ఎస్‌ఎల్‌బిసి టన్నెలు విషయంలో గత ప్రభుత్వం పదేండ్ల పట్టించుకోలేదు. మూడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఎస్‌ఎల్‌బిసిని ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్షం చేశారని వివరించారు. తమ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బిసి, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. గత 14నెలల్లో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు తమ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. దశాబ్దాలుగా భర్తీకాని గ్రూప్ —-1 563 ఉద్యోగనియామకాలకు కొందరు అడ్డుపడుతున్నారు. దీని వెనుకాల రాజకీయపార్టీలు, నాయకులు ఎవరు ఉన్నారో కూడా మాకు తెలుసునన్నారు. ఏది ఏమైన త్వరలోనే పబ్లిక్ సర్వీసు ఉద్యోగాల నియామకాలను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.