Friday, May 16, 2025

బిజెపి మంత్రికి సుప్రీంకోర్టు షాక్..

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని మంత్రి విజయ్ షా సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే, మంత్రికి న్యాయస్థానం ఊహించని షాకిచ్చింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమంటూ మంత్రి పిటిషన్ ను తిరస్కరించింది.

కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, ఆపరేషన్ సిందూర్ నిర్వహించి.. ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ గురించిన వివరాలు వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్ షా మాట్లాడుతూ.. వాళ్ల సోదరినే పంపి ఉగ్రవాదులకు ప్రధాని మోడీ, తగిన బుద్ది చెప్పారని వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మంత్రి విజయ్ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనపై ఇండోర్‌లోని మోవ్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News