కని పెంచి పెద్ద చేసిన తల్లి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాల్సిన కన్న కొడుకు ఆస్తి కోసం తల్లి అంతిమ సంస్కారలను అడ్డుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జైపూర్ సమీపంలో విరాట్ నగర్ ప్రాంతంలో ఈనెల 3న చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ (80) అనారోగ్యంతో మృతి చెందింది.ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు పెద్ద కొడుకు చూసుకున్నాడు. అయితే కుటుంబ పెద్దలు ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు,
ఇతర బంగారు ఆభరణాలు పెద్ద కొడుకుకి అప్పగించారు. తల్లి ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని చిన్న కుమారుడు పట్టుబట్టాడు. తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రయలు నిర్వహించాలని లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చి వేయండి అంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు. చివరకు ఆభరణాలు అతడికి ఇవ్వడంతో తల్లికి పెద్ద కొడుకు అంత్యక్రియలు నిర్వహించాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.