Sunday, May 18, 2025

కొత్త నోట్లు వస్తున్నాయ్.. ఈసారి ఆయన సంతకంతో..

- Advertisement -
- Advertisement -

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. త్వరలోనే కొత్త రూ.20 డినామినేషన్ నోట్లు వస్తున్నాయని వెల్లడించింది. మహాత్మగాంధీ (కొత్త) సిరీస్‌ కింద వచ్చే ఈ నోట్లపై ప్రస్తుత ఆర్‌బిఐ(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. కొత్త నోట్ల (New Notes) డిజైన్, ఫీచర్లు, ప్రస్తుతం మహాత్మగాంధీ (కొత్త) సిరీస్‌లో ఉన్న విధంగానే ఉంటాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఎల్లోరా గుహల చిహ్నం అలాగే ఉంటాయని పేర్కొంది.

అయితే గతంలో జారీ చేసిన అన్ని రూ.20 నోట్లు జారీ చేసిన గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా అన్ని చెల్లుబాటు అవుతాయని ఆర్‌‌బిఐ స్పష్టం చేసింది. కొత్త నోట్లను అందుబాటులోకి తేవడానికి ఓ కారణం ఉందని చెప్పింది. నాయకత్వం మార్పు వచ్చినప్పుడు ఈ ప్రక్రియ జరగడం సాధారణమే అని పేర్కొంది. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపించదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News