టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొద్ది రోజుల క్రితం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కి రోహిత్ శర్మ పేరును పెట్టింది ముంబై క్రికెట్ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు రోహిత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అయితే టీం ఇండియా కెప్టెన్‌గా రెండు ఐసిసి ట్రోఫీలను జట్టుకు అందించిన రోహిత్ శర్మకు మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తనదైన శైలీలో అభినందనలు తెలిపారు. ఇంతటి గౌరవానికి రోహిత్ శర్మ అన్ని విధాలుగా అర్హుడని రాహుల్ అన్నారు.
‘‘కుటుంబసభ్యులు, స్నేహితుల ముందు స్టాండ్ లాంచ్ కావడం లాంటి రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ స్టాండ్‌లో నువ్వు మరిన్ని సిక్సులు కొట్టాలి. నాకు ఎప్పుడైనా ముంబైలో టికెట్లు దొరకకపోతే.. ఎవరికి సంప్రదించాలో ఇప్పుడు అర్థమైంది. నీ పేరు మీద స్టాండే ఉంది.. ఆ విషయం అస్సలు మర్చిపోను’’ అంటూ ద్రవిడ్ చమత్కరించారు.