లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో(LSG) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో ఆడే చివరి మ్యాచులు అయినా మంచిగా ఆడి సీజన్‌కి శుభం పలకాలని అనుకుంటుంది.
మరోవైపు లక్నో జట్టుకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో మంచి రన్‌రేటుతో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కి వెళ్లే అవకాశ ఉంది. లేని పక్షంలో సీజన్‌ను ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టులో ఒక మార్పు చేసింది. విల్ ఓరూర్కే ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇక సన్‌రైజర్స్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ట్రావిస్ హెడ్, ఉనద్కట్ స్థానంలో హర్ష్ దుబే, టైడే జట్టులోకి వచ్చారు.