న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా , ఓ జ ట్టుగా పనిచేస్తే ఏ లక్షం అయినా ఛేదించవచ్చు. అసాధ్యం అంటూ ఏదీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశంలో శనివారం ఆయన నీతి ఆయోగ్ అధ్యక్ష హోదాలో ప్రసంగించారు.మనం టీం ఇండియా స్ఫూర్తితో వ్యవహరిస్తే అసాధ్యం సుసాధ్యం అవుతుంది. మన ప్రగతి కుం టుపడకుండా ముందుకు సాగుతందని ప్రధాని తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యుటిల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర కీలక శాఖల మంత్రుల స్ఖాయిలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. మనం సాధించిన ప్రగతితో సంతృప్తి చెందకుండా, ప్రగతిపథంలో మరింత వేగంగా సాగాల్సి ఉందని ఆయన తెలిపారు. మన ముందు పలు లక్షాలు ఉన్నాయి. అయితే వీటిని ఎవరికి వారేగా వ్యవహరిస్తే ఛేదించడం కష్టం అవుతుందని హెచ్చరించా రు. మనది దేశం జట్టు అని భావించుకుని ముం దుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఇప్పటి నీతి ఆయోగ్ భేటీ ప్రధాన చర్చనీయాంశం వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ @ గా ఖరారు చేశారు. 2047 నాటికి భారత్ సంపన్నం కావాలనేదే ఈ లక్షం. ఈ నినాదం 140కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల ప్రతిఫలం అన్నారు.
అన్ని రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయం
ప్రతి రాష్ట్రం సరైన విధంగా ప్రగతి సాధించాలి. ప్రతి నగరం, అన్ని నగరపాలికలు ప్రగతి పథంలో సాగాలి. ఇదే విధంగా ఈ ప్రక్రియ గ్రామీణ స్థా యి వరకూ చేరుకోవల్సి ఉందన్నారు. ఈ పరిధిలో మనం వెళ్లితే ఈ వేగాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదన్నారు. కలిసికట్టుగా సాగితే వికసిత్ భారత్ లక్ష ఛేదనకు మనం 2047 వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. వికసిత్ భారత్ మన అందరి లక్షం కావలి. ఇందుకు సరైన కార్యాచరణ అత్యవసరం అన్నారు. అన్ని రాష్ట్రాలూ తమ తమ వనరులను ప్రాతిపదికగా చేసుకుని కార్యక్రమాలు రూపొందించుకోవాలి. సమగ్ర ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రం కనీసం ఒక్కటైన ప్రపంచ స్థాయి ప్రామాణికతల పర్యాటక మజిలీని ఏర్పాటు చేసుకుని తీరాలి. ఒక్క రాష్ట్రం ఒక్క ప్రపంచ స్థాయి మజిలీ నినాదం కావాలని సూచించారు.ఒక్క పర్యాటక స్థలం వృద్ధి చెందితే ఇక చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కూడా విలసిల్లుతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి సరైన ఆర్థిక వృద్ధి మార్గాలు ఏర్పడుతాయని ఆయన ఈ భేటీ ప్రారంభోపన్యాసంలో వివరించారు. భారత్ ఇక భవిష్య అవసరాల నగరాల ఏర్పాటు దిశలో సాగాల్సి ఉందని చెప్పారు. ప్రగతి , సృజనాత్మకత భారతీయ నగరాలకు ఛోదక శక్తి కావాలని పిలుపు నిచ్చారు. పట్టణాభివృద్ధి , ప్రామాణిక పరివర్తన స్థాయిలో సాగాల్సి ఉందని చెప్పారు. మన శ్రమశక్తిలో అనివార్యంగా మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉంటేనే అది సంపూర్ణ వికాసానికి దారితీస్తుందని తెలిపారు.