Friday, June 20, 2025

మెగాఫోన్ పట్టనున్న స్టార్ బ్యూటీ?

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని బాబు పుట్టాక మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 3 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో పాటు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న మైథలాజికల్ మూవీ కన్నప్పలో పార్వతీదేవిగా నటించింది. ఇవి కాకుండా కాజల్ చేతిలో కొత్త అవకాశాలేమీ లేవు. ఓ వైపు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ, మరోవైపు సొంత బిజినెస్ లతో కూడా కాజల్ బిజీగా ఉంది.

అయితే సినిమాల పరంగా తనకు ఛాన్సులు తక్కువైన నేపథ్యంలో మళ్లీ అవకాశాలను దక్కించుకోవాలనే ఆలోచనతో కాజల్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాజల్ మెగాఫోన్‌ను పట్టి డైరెక్టర్‌గా సినిమా చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రైమ్ టైమ్‌లోకి రావాలనే ఆలోచనతో స్వీయ దర్శకత్వంలో హీరోయిన్‌గా సినిమా చేయాలని చూస్తోందట. బాలీవుడ్ లో కమర్షియల్ అంశాలతో ఓ సినిమాను తెరకెక్కించడానికి కాజల్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News