Thursday, September 18, 2025

‘మెగా 157’ షూటింగ్‌లో నయనతార

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ ‘మెగా 157’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార బుధవారం ముస్సోరీలో షూటింగ్‌లో చేరారు.

కథా పరంగా, తన పాత్రపై ఎంతో ఆనందంగా వున్న నయనతార, సినిమా ప్రమోషన్‌ల్లో చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. రాబోయే ప్రచార కార్యక్రమాల్లో నయనతార అదరగొట్టబోతున్నారు. ‘మెగా 157’ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News