Monday, June 23, 2025

ఫోర్డో అణ్వస్త్ర కేంద్రాన్ని తరలించిన ఇరాన్

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో అణ్వస్త్ర కేంద్రాన్ని మరో ప్రదేశానికి ఇరాన్ తరలించింది. కీలక పరికరాలు, యురేనియాన్ని తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాటిలైట్‌ చిత్రాల్లో భారీ సంఖ్యలో ట్రక్కులు కనిపించాయి. 16 కార్గో ట్రక్కులు టన్నెల్‌లోకి ప్రవేశించినట్లు శాటిలైట్ చిత్రాల్లో గుర్తించారు. కీలకమైన సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్‌ తరలించినట్టు అమెరికా వైమానిక అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని అణ్వస్త్ర కేంద్రాలను ఇరాన్‌ శత్రుదుర్భేద్యంగా నిర్మించింది.  ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ దాడులకు దీటుగా ఇరాన్‌ ప్రతీకార దాడులు నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఫార్దో, నతాంజ్‌, ఇన్ఫహాన్‌ అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News