ముంబయి: విద్యార్థిపై పంతులమ్మ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. దీంతో ఆమెపై పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముంబయిలోని ఓ పాఠశాలలో సదరు పంతులమ్మ ఇంగ్లీష్ బోధిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో జరిగిన వార్షిక వేడుకల్లో విద్యార్థితో పంతులమ్మ పరిచయం కావడంతో బాలుడితో చనువుగా మాట్లాడింది. ఆమెకు వివాహం జరిగినప్పటికి అతడిని ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ఒక రోజు బాలుడిని ఖరీదైన హోటల్‌కు తీసుకెళ్లి లైంగికంగా వేధించింది. బాలుడిలో మార్పులు కనపించినట్టు తల్లిదండ్రులు గుర్తించారు. పదో తరగతి పరీక్షలు ఉండడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకుండా ఆగిపోయారు. పరీక్షలు పూర్తి అయిన తరువాత తన ఇంట్లో పని చేసే సిబ్బందితో పంతులమ్మ బాలుడికి రాయబారం పంపడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై పోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిపై పంతులమ్మ లైంగిక వేధింపులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -