Friday, July 4, 2025

ట్రైలర్‌ను పవన్ ఏడు సార్లు చూశారు: ఎఎం రత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హరి హర వీరమల్లు సినిమా పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా అని నిర్మాత ఎఎం రత్నం తెలిపారు. ఆయనతో ఖుషి సినిమా చేసేటప్పుడు పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నానని చెప్పారు. హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా ఎఎం రత్నం మీడియాతో మాట్లాడారు. పవన్ అభిమానులు ఊహించని స్థాయిలో ట్రైలర్ అద్భుతందని కొనియాడారు. ఈ సినిమా ట్రైలర్‌ను పవన్ ఏడు సార్లు చూశారని, ఐదు సంవత్సరాల తరువాత ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని పేర్కొన్నారు.

ఛావా సినిమా చూసి ఎందురో భావోద్వేగానికి గురయ్యారని, ఈ చిత్రం కూడా అలాంటిదేనని తెలియజేశారు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ పవర్ స్టార్ అన్నారని, ఈ సినిమా వీక్షించిన తరువాత రియల్ స్టార్ అని పిలుస్తారని ఎఎం రత్నం ప్రశంసించారు. అందరూ సినిమాల్లో హీరోగా కనిపిస్తారని, కానీ పవన్ మాత్రం నిజం జీవితంలోనూ రియల్ హీరోగా కనిపిస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ సినిమాతో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని ఆశబావం వ్యక్తం చేశారు. ఇలాంటి కమర్షియల్ సినిమా తీసిన క్రెడిట్ దర్శకుడు జ్యోతికృష్ణ దక్కుతుందన్నారు. ఈ మూవీ పేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆయన తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News