Friday, July 4, 2025

బాధ్యతలు రాగానే ఉవ్వెత్తున లేస్తారు: యువీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేయడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఇద్దరిని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ మెచ్చుకున్నారు. బౌలింగ్ అనుకూలంగా ఉన్న పిచ్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని గిల్‌ను యువీ ప్రశంసించారు. కొందరికి బాధ్యతలు రాగానే ఉవ్వెత్తున లేస్తారని కొనియాడారు. తనలో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతారని, అదే కోవకు గిల్ వస్తాడని యువీ తెలిపారు. కెప్టెన్‌గా గిల్ రెండు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడని, కామ్‌గా ఉంటూ తొందరపాటు గురికాకుండా పరుగుల దాహం తీర్చుకుంటున్నారని యువీ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 85 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News