Sunday, July 6, 2025

విదేశాల్లో వినోదాత్మక, ఎనర్జీ సీక్వెన్స్‌లు

- Advertisement -
- Advertisement -

హీరో వరుణ్ తేజ్.. మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఇండో, కొరియన్ హారర్ కామెడీ ‘విటి15’తో (VT15) సర్‌ప్రైజ్ చేయ బోతున్నారు. యూవీక్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, అనంతపురం షెడ్యూల్స్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, (Varun Tej) ప్రధాన తారా గణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో వినోదాత్మక, ఎనర్జీ సీక్వెన్స్‌లని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో 80 శాతం షూటింగ్ పూర్తవుతుంది. టైటిల్, గ్లింప్స్‌తో సహా మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే తెలియజే స్తారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News