- Advertisement -
ఈ నెల నుంచి యుపిఐ యాప్ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ కొన్ని నియంత్రణలు విధించింది. బ్యాలెన్స్ చెక్ పరిమితి ఇప్పుడు యూజర్లు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ఆటో-పే లావాదేవీల సమయ పరిమితి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 మధ్య ప్రాసెస్ చేయరు. లావాదేవీ స్థితి, నిలిచిపోయిన చెల్లింపుల వివరాలను 3 సార్లు మాత్రమే 90 సెకన్ల విరామంతో చెక్ చేయవచ్చు. ఇప్పుడు క్లెయిమ్ తిరస్కరణల విషయంలో బ్యాంకులు ఎన్‌పిసిఐ అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు,- సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఈ మార్పులు యుపిఐ ఆధారిత లావాదేవీల భద్రతను మెరుగుపరచడమే కాకుండా, వేగవంతమైన సేవల కోసం కూడా తీసుకున్న చర్యలుగా భావించవచ్చు.
- Advertisement -