- Advertisement -
తిరుపతి: తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 6 నుండి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 6న సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 7న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 8న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 9న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం చేపడతారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- Advertisement -