Monday, August 4, 2025

భార్య ముందే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్య కాపురానికి రావడంలేదని భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లంపేట గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, రాయవరం గ్రామానికి చెందిన చెన్నమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసు వెళ్లారు.

భార్యభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో భార్య అలిగి తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం బ్రహ్మయ్య అత్తారింటికి వెళ్లి భార్యను ఇంటికి రమ్మని బతిమిలాడాడు. భార్య తిర్కస్కరించడంతో పలుమార్లు దూషించింది. దీంతో భర్త తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. గ్రామస్థుల వెంటనే అతడిని మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలబై శాతం గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆత్మహత్యకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News