Monday, August 4, 2025

భగవంత్ కేసరి’ సీక్వెల్‌కు ప్రయత్నిస్తా

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavant Kesari) చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించగా, ఈ సినిమాకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన దక్కింది. ఇక ఈ సినిమా తాజాగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ తెలుగు చిత్రం గా అవార్డును అందుకుంది. అయితే, ఈ సినిమాకు ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తమ సినిమాలో మంచి మెసేజ్ ఉండటంతో నేషనల్ అవార్డు గెలుచుకుందని నందమూరి బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే, ఈ చిత్ర సీక్వెల్‌పై దర్శకుడు (Director film sequel) అనిల్ రావిపూడి తాజాగా ఓపెన్ అయ్యాడు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని తనకు కూడా ఉందని.. సరైన టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా సీక్వెల్ ప్లాన్ చేసేందుకు ప్రయత్నిస్తానంటూ ఆయన కామెంట్ చేశాడు. దీంతో భగవంత్ కేసరి చిత్ర సీక్వెల్ ఒకవేళ ఉంటే, అది ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News