శివారులో పూర్తిగా ఉనికిని కోల్పోతున్న చిరుత పులులు
ఔటర్‌తో ఏర్పడిన అగాధం హిమాయత్ సాగర వద్ద కూడలి అభివృద్ధితో మొదటికే మోసం
కొత్వాల్ గూడలో కూడా బతకనిచ్చేలా లేరు..!
పెద్ద పులికంటే చిరుత పులి ఎంతో తెలివైనవి. ఇది వేట మొదలు పెట్టిందంటే గురి తప్పదు. పిల్లి జాతికి చెందిన జంతువుల్లో పెద్ద పులి వేటలో అనేక మార్లు విఫలమవుతుంది. కానీ చిరుత అలా కాదు. వేటకు ఎరగా ఎంచుకున్న జంతువును తీక్షణంగా పరిశీలిస్తుంది. అంతే ఏలాంటి వినికిడి లేకుండా కనిపించకుండా నక్కి ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఇతర జీవులు పసిగట్టలేనంతాగా చిరుత పులి వేట శైలి ఉంటుంది.
మన తెలంగాణ/రాజేంద్రనగర్ : తీక్షణమైన చూపు. నక్కి ఉండి పంజా కొట్టె తత్వం. ఆహార వేటలో పెద్దపులి కంటే ఎంతో తెలివైనది. సులువుగా వేటాడంలో వన్యమృగాల్లోనే నేర్పరి. ఇది చిరుత పులి నైజం. కోతుల ఆవాస ప్రాంతాల్లో దీనికి ఆహార వేట కష్టతరమే. అటవీ ప్రాంతాల నుంచి జనవాసాల్లోకి చేరుతున్న చిరుతలు అలజడి సృష్టించడం సాధారమవుతుంది. అవి ఎందుకు జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి..? దారి తప్పినా..? ఆహార వేటలో ముందుకుసాగుతూ జనం కంటపడుతున్నాయా..? అందుకు కారణాలు అనేకం ఉన్నాయి మరీ. రెండు దశాబ్ధాల క్రితం బంజారాహిల్స్‌లో సంచలనం రేపిన చిరుత కావచ్చూ. ఐదేళ్ల క్రితం లాక్ డౌన్ సమయంలో గగన్‌పహాడ్‌లో ప్రత్యేక్షమై, ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో వాకర్స్‌ను ఆందోళన చెందేలా చేసిన చిరుత పులి విషయం తెలిసిందే. తాజాగా మహానగర శివారులో నెల రోజులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న తెలివైన చిరుతపై పాఠకుల కోసం ‘మన తెలంగాణ’ ప్రత్యేక కథనం.
పిల్లి జాతికి చెందినదే చిరుత
చిరుత పులి పిల్లి జాతికి చెందిన మాంసాహార జంతువు. దీని శాస్త్రీయ నామం పాంథెరా పార్డస్. పాథెరా జాతికి చెందిన పిల్లి జాతిలో ఇది ఒకటి. పాత ఫ్రెంచ్ ల్యూపార్డ్ లేదా మిడిల్ ఫ్రెంచ్ లైపార్డ్ నుంచి చిరుతకు ఆ పేరు వచ్చింది. పురాతన గ్రీకు ‘లియోపార్డోస్’ నుంచి ఉద్భవించినందనిగా కూడా చరిత్ర కారులు చెప్పారు. ఇక రోమన్లు అడవి జంతువులను పట్టుకోవడానికి వీటిని ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. ఇది లేత పసుపు వర్ణం నుంచి ముదురు బంగారు రంగులో నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్యాథర్‌ను 1758లో చిరుత పులిగా వర్ణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇవి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో విరివిగా విస్తరించి జీవనం సాగిస్తున్నాయి. వీటిలో ఎనిమిది ఉప జాతుల వరకు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆవాసం,- ఆహారం ఏమిటి?
చిరుత పులి వర్షాలు కురిసే అరణ్యాలు, గడ్డి మైదానాలు, తడి ప్రదేశాలతో పాటు పర్వత ప్రాంతాల్లో అవలీలగా ఆవాసం ఉంటుంది. చిన్న , చిన్న రాళ్లుతో కూడిన గుట్టల్లో కూడా ఇది విలక్షణంగా జీవించగలరు. సాధరణంగా అటవీ ప్రాంతాల్లో చిరుత పులి జింకలు, దుప్పిలు, నెమళ్లు, అడవి పందులను వేటాడి తింటుంది. కొన్ని సందర్భాల్లో సరదాగా ఇది ముళ్ల పందిని వేటాడి ఇష్టంగా ఆరగిస్తుంది. ఇక వయస్సు మీద పడిన చిరుతలు సులువుగా ఆహారం సాధించుకునే మార్గాలు ఎంచుకుంటాయి. అందుకు గోర్రెలు, మేకల పై దాడి చేసి తింటాయి. ఇవి కూడా లభించకపోతే గ్రామ సింహాలుగా మనం పిలుచుకునే కుక్కలను నోట కరిచి ఆరగిస్తాయి. వేటాడే సమయంలో ఇవి ఎంతో నేర్పరి తనం ప్రదర్శిస్తాయి. దీని పంజాకు బలికాబోయే జంతువుకు ఎలాంటి అనుమానం రాకుండా దాడికి దిగే వరకు నక్కి ఉంటుంది. పెద్ద పులిలా దీని వేట ఎప్పుడు గురి తప్పదు. ఒక్కసారి అడుగు ముందుకు వేసిందంటే ఆహారంగా ఎంచుకున్న జంతువు నోటికి అందాల్సిందే. అలా వేటాడిన జంతువును కడుపునిండా ఆరగించాక మిగిలిన దాన్ని చెట్ల పైకి తీసువెళ్లి దాచుకుని మరీ తింటుంది చిరుత.
ఒంటరిగా ముందుకు
చిరుత పులులు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో 10 నుంచి 12 సంవత్సరాలు జీవిత ప్రమానం కలిగి ఉంటాయి. జూపార్కుల వంటి ప్రత్యేక సంరక్షణలో అయితే 15 నుంచి 20 ఏళ్ల వరకు జీవించగలవు. ఇవి రెండున్నర ఏళ్ల నుంచి 3 సంవత్సరాలలో యుక్తవయస్సుకి వస్తాయి. ఆడ, మగ చిరుతల కలయికల అనంతరం ఆడ జంతువు రెండు నుంచి నాలుగు కూనలకు జన్మనిస్తుంది. పుట్టిన పిల్లలు సుమారు ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు తల్లి చాటు పిల్లలుగా జీవనం సాగిస్తాయి. అనంతరం విడిపోయి స్వతంత్ర జీవన యానం ప్రారభిస్తాయి. ఇవి మూడు అడుగుల ఎత్తు ఉండి 5 అడుగుల పోడవు వరకు పెరగలవు. వీటి తోక దాదాపు వీటి శరీరం కంటే పొడవుగా ఉంటుంది. ఇక ఆడ జంతువు మగ జంతువుతో జతట్టడానికి తాను సిద్దంగా ఉన్నట్లు మూత్ర విసర్జన చేసి మగ జంతువును ఆకట్టుకుంటుంది. మగ జంతువు విసర్జించిన మూత్రాన్ని గ్రహించి ఆ ప్రాంతంతలో జతగాడి కోసం వేయి ఉంటుంది. కలయిక అనంతరం ఆడ, మగ ఎవరీ దారి వారిదే. అలా మగ జంతువు ప్రయాణం సాగిస్తూ జనవాసాల్లోకి, గోర్రెల, పశువుల దొడ్లు ఉండే ప్రామీణ ప్రాంతాలకు చేరుతుంటాయి.
నగర శివారులో ఉనికి కోల్పోతున్న చిరుతలు
చిరుత పులులు చిన్న గుట్టల్లో కూడా సులువుగా జీవించగలవు. అలా నగర శివారులోని అనేక గుట్ట ల ప్రాంతాలోల అవి తమ ఉనికి చాటుతూ వచ్చా యి. ఈ కోవలో హిమాయత్‌సాగర్ జలాశయం చుట్టు ప్రక్కల చాలానే చిరుత పులులు ఉండేవి. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో గుట్టలను పిండి చేశారు. తాజాగా హిమాయత్‌సాగర్ సమీపంలోని రాజేంద్రనగర్ ఎగ్జిట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఉన్న కస్తా గుట్ట ప్రాంతం కనుమరుగు అవుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున అక్కడి గుట్టలను తొలిచేశారు. పెద్ద పెద్ద బండరాళ్లను పగు ల గొట్టేందుకు పేలుడు పదార్థాలు వినియోగించి చే స్తున్న పేల్చివేతలు చిరుత పులులను భయకంపితపరుస్తున్నాయి. ఇక కొత్వాల్ గూడ ప్రాంతంలోని అటవీ గుట్టలను అభివృద్ధి చేస్తున్నారు. వారాంతం లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఫారెస్ట్ ట్రెక్ పా ర్కులో ప్రకృతితో నడక కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. దాంతో ఔత్సాహికులు రాక్ ట్రెక్కిం గ్, అటవీలో అర్థరాత్రి, చలిమంటల మాటున గు డారాలు వేసుకుని విజ్ఞానంతో పాటు వినోధం పొం దుతున్నారు. ఫలితంగా చిలుకూరు రిజర్వూ పారె స్ట్ కూడా చిరుత ఆవాసా యోగంలేని విధంగా మా రిపోతుంది. దీంతో కొద్ది కాలంలో చిరుత ఎక్కడ నీ చిరునామా అనే విధంగా పరిస్థితి మారనుంది.