Monday, August 4, 2025

గ్రామాలలో బిసిలను చైతన్యం చేయాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్:  రాష్ట్రంలో ఉన్న బిసిలను చైతన్య పరచడమే మన ఆలోచనా సాధన సమితి (మాస్) లక్ష్యం అని,
రాష్ట్రంలో ఉన్నట్టువంటి 10వేల గ్రామాలలో బీసీ ల జెండా”ను ఎగురవేసినప్పుడే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మన ఆలోచన సాధన సమితి (మాస్) రాష్ట్ర అధ్యక్షులు కటికం నర్సింగ్ రావు అన్నారు. ఆదివారం యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీలను జెండాలను మోయించుకుంటూ, జిందాబాద్ కొట్టించుకుంటున్నారే తప్పా… రాజకీయంగా ఎదగనీవ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలలో చైతన్యం తీసుకురావడం కోసమే.గత ఏడాది మన ఆలోచన సాధన సమితి సంఘం ఏర్పాటు చేశామని….ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని గ్రామాలలో బీసీల జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలై లో మొదటి విడత లో 135 గ్రామాలలో బిసి జెండా ఎగరవేశామని ,నేడు రెండో విడతలో మరో 15 గ్రామాలలో జెండా ఎగరవేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ ఉద్యమాన్ని విస్తరించి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన ఆలోచన సాధన సమితి నియోజకవర్గ సంఘం నాయకులు లింగంపల్లి రఘువర్ధన్, స్థానిక నాయకులు శివార్ల శ్రీనివాస్, నిలిగొండ మత్స్యగిరి , మర్రి అనిల్ కుమార్, బుంగపట్ల ప్రభాకర్, కాంబోజు మహేందర్, చేతరాశి వెంకన్న, చోల్లేటి సోమేశ్వర్ , అన్నెపు నర్సింహ్మ, పురుగుల యాదగిరి కనుకు రాజు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News