Monday, August 4, 2025

భార్య తల నరికి… టివి ఛానెల్‌కు చేరుకొని

- Advertisement -
- Advertisement -

చెన్నై: సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ తన భార్యను చంపేసి అనంతరం ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వూకు వచ్చారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ట్యూటికోరిన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తలవాయుపురం గ్రామానికి చెందిన తమిళ్ సెల్వన్ అనే సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్, ఉమామహేశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో జులై 31న తన భార్య ఉమా మహేశ్వరితో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య తల నరికి చంపేశాడు. తొమ్మిదేళ్ల కుమారుడు, కుమార్తెను వాళ్ల మామ ఇంటికి పంపించాడు. రెండు రోజుల తరువాత తమిళ్ సెల్వన్ ఒక టివి స్టూడియోకు వచ్చి తన భార్య హత్య గురించి మాట్లాడుతానని చెప్పాడు. దీంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానం ఉండడంతో ఇంట్లో, ఇంటి బయట భర్త సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News