Monday, August 4, 2025

ఢిల్లీలో నడిరోడ్డుపై మహిళా ఎంపి చైన్ ను కొట్టేసిన స్నాచర్లు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఓ మహిళా ఎంపి వాకింగ్ చేస్తుండగా ఆమె మెడలోని చైన్‌ను లాక్కెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీలో చాణక్యపురిలో జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందని కాంగ్రెస్ ఎంపి సుధా రామకృష్ణన్, డిఎంకె నాయకురాలు రజతితో కలిసి పోలండ ఎంబసి సమీపంలో గేట్ 3 నుంచి గేట్ 4కు మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఇద్దరికి ఎదురుగా ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని స్కూటీ మీద వచ్చారు. తన మెడలో గొలుసు చైన్ ను స్నాచర్ లాక్కొని పారిపోయాడు. మాకు ఎదురుగా బండిపై నిదానంగా వస్తుండడంతో తాము చైన్ స్నాచర్ అనుకోలేదని సదరు ఎంపి తెలిపారు. అతడు బలంగా గొలుసు లాగడంతో తన మెడపై గాయాలయ్యానని సుధా పేర్కొన్నారు. ఒంటిపై ఉన్న దుస్తులు కూడా కొద్దిమేర చినిగిపోయానని చెప్పారు. చైన్ స్నాచర్ లాగిన వెంటనే సహాయం కోసం ఎదురుచూశామని, ఎవరూ కనిపించలేదన్నారు. కొద్దిసేపటికి పెట్రోలింగ్ వాహనం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అత్యంత భద్రత కలిగిన ఎంపికే ఇలాంటివి జరిగితే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దాదాపు మూడు తులాలన్నర బంగారు గొలుసు పోగొట్టుకున్నానని చెప్పారు. నిందితుడిని గుర్తించడంతో పాటు తక్షణమే తనకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హోంమంత్రి అమిత్ షాను సుధా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News