లండన్: ఇంగ్లండ్-భారత్ (Ind Vs Eng) మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. నిజానికి నాలుగో రోజే ఆట ముగుస్తుందని అంతా అనుకున్నారు. హ్యారీ బ్రూక్, జో రూట్‌లు కలిసి ఇంగ్లండ్‌కి విజయాన్ని కట్టబెడతారని భావించారు. కానీ, భారత బౌలర్లు మాత్రం ఆతిథ్య జట్టుకు ఆ అవకాశం ఇవ్వలేదు. కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై తిరిగి పట్టుసాధించారు. అయితే నాలుగో రోజు బ్యాడ్ లైట్ కారణంగా ఆటని త్వరగా ముగించారు. దీంతో మ్యాచ్ ఐదో రోజు వరకూ వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు చేయాలి.. భారత్ నెగ్గాలంటే 4 వికెట్లు పడగొట్టాలి.
ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఐదో టెస్ట్ మ్యాచ్‌కి (Ind Vs Eng) వరుణుడు ఆది నుంచే ఆటంకం కలిగిస్తున్నాడు. తొలి రోజు వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా పడింది. రెండు, మూడో రోజు మ్యాచ్ సజావుగా జరిగినా.. మళ్లీ నాలుగో రోజు మ్యాచ్‌పై వాతావరణం ప్రభావం చూపించింది. ఇప్పుడు ఐదో రోజు వర్షం పడి.. మ్యాచ్ జరగకపోతే.. ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. తద్వారా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ సిరీస్‌ని సొంతం చేసుకుంది. అయితే అక్యువెదర్ రిపోర్డ్ ప్రకారం.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువ. దీంతో మ్యాచ్ జరిగే ఛాన్స్‌లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అభిమానులు వర్షం పడకూడదనే కోరుకుంటున్నారు. టీం ఇండియా త్వరగా వికెట్లు తీసి మ్యాచ్‌లో విజయం సాధించాలని ప్రార్థిస్తున్నారు. లేక ఇంగ్లండ్ 35 పరుగులు చేస్తే ఇంగ్లండ్ గెలుస్తోంది. టై కావాలంటే సరిగ్గా 34 పరుగులు చేసి.. ఇండియా 4 వికెట్లు తీయాలి.