హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ భార్య, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆమెను రాష్ట్ర స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు.
‘‘మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్. గౌరవప్రదమైన ఈ పదవి ఆమెకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది గౌరవం కంటే బాధ్యతను పెంచింది. ఉపాసన.. మీకున్న నిబద్ధతతో, ప్యాషన్‌తో మన క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సాహిస్తారని, ప్రతిభావంతులను అగ్రస్థానంలో నిలబెట్టడానికి తగిన పాలసీలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను’’ అని చిరు (Chiranjeevi) ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అంతకు ముందు తనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనకి దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సంజీవ్ గోయోంకాతో కలిసి పని చేసే అవకాశం రావడం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.