అబుదాబీ: ఆసియాకప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. గ్రూప్ బిలో శ్రీలంక జట్టుతో ఆఫ్ఘానిస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి అఫ్ఘాన్ (Afghanistan) జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే శ్రీలంక ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేసి లీగ్ దశని విజయంతో ముగించాలని భావిస్తోంది. మరోవైపు అఫ్ఘాన్ గ్రూప్ దశలో హాంగ్‌కాంగ్‌పై విజయం సాధించగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో అప్ఘాన్‌కు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టులో ఒక మార్పు చేయగా.. అఫ్ఘానిస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
అప్ఘానిస్థాన్ (Afghanistan): సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, దర్వీష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), కమిల్ మిషార, కుషల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీర, నువాన్ తుషార.
Also Read : పాక్ ఫీల్డర్ నిర్లక్ష్యం. అంపైర్ తలకి తీవ్ర గాయం..