Friday, September 19, 2025

ఎసిబి వలలో ఆర్‌ఐ, డిప్యూటీ సర్వేయర్

- Advertisement -
- Advertisement -

అవినీతి అధికారులు ఎంతమంది పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగంలో పని చేస్తున్న అధికారులలో మార్పు రావడం లేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట ఎసిబి వలలో లంచగొండి అధికారులు చిక్కుతున్నారు. తాజాగా ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. కొత్తకోట మండల పరిధిలోని నిర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు తన ఇనాం భూమిని ఓఆర్ చేసుకోవాలని దరఖాస్తు చేసుకోగా సంబంధిత ఆర్‌ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిలు ఆదేశాలు జారీ చేశారు. భూమి సరి చూడడానికి రూ 40వేలు లంచం ఇవ్వాలని ఇద్దరు అధికారులు డిమాండ్ చేయడంతో దీంతో బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.

ఈ ఫిర్యాదు మేరకు గురువారం ఎసిబి అధికారులు కాపు కాసి ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఆర్‌ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం వారిని శుక్రవారం నాంపల్లి ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరు పరచనునట్లు ఎసిబి డిఎస్పి బాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న వారు ఎవరైనా లంచం అడిగినట్లు తెలిస్తే ఎసిబి టోల్ ఫ్రీ నెం. 1064 గాను వాట్సప్ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, బాధితులు ధైర్యంగా ఎసిబిని సంప్రదించాలని కోరారు. ఈ దాడిలో ఎసిబి సిఐలు రంగస్వామి, కిషన్ నాయక్, ఎస్‌కె జిలాని, ఎసిబి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News