Friday, September 19, 2025

అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా

- Advertisement -
- Advertisement -

తార్నాక పరిధిలో ముగ్గురు మహిళలు జట్టుగా మారి..అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా కొట్టి వారి వద్ద విలువైన వస్తువులు చోరీ చేసి మాయమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ యువకుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి.. ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమగా మాట కలిపింది. మాదాపూర్ లోని హోటల్లో గది బుక్ చేశానంటూ ఆశచూపింది. ముంబయి నుంచి వచ్చేందుకు విమాన టిక్కెట్ల సొమ్ము వసూలు చేసింది. ఆశ వెళ్లిన అతడు ఇదంతా మోసమని గ్రహించాడు. నగరం నుంచి గోవా వెళ్లిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు.. అక్కడ అమ్మాయిలను జత చేస్తానంటూ చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి రూ.20వేలు నష్టపోయారు. సికింద్రాబాద్ కు చెందిన మంజుల అడ్డదారిలో డబ్బు సంపాదనకు నకిలీ విలేకరి అవతారమెత్తింది. మరో నలుగురితో ముఠా కట్టింది.

అమ్మాయిల మోజున్న సరదారాయుళ్ల జాబితా సిద్ధం చేసింది. చేవెళ్లలో యోగా గురువు వద్దకు శిక్షణ కోసమంటూ రజనీరెడ్డితో కలిసి వెళ్లి అతడి బలహీనతలు గుర్తించారు.రజనితో వలపు వలలో చిక్కేలా చేశారు.ముందుగానే శంషాబాద్లో బుక్ చేసిన హోటల్కు అతన్ని తీసుకెళ్లారు. కోఠిలో కొన్న స్పై కెమెరా గదిలో అమర్చారు.యోగాగురువు, రజని సన్నిహితంగా మెలిగే దృశ్యాలను అందులో చిత్రీకరించారు.రెండ్రోజుల తరువాత తారామతి బారాదరి రిసార్ట్లో యోగాగురువు, రజని కలిశారు. హోటల్లో ఉన్నప్పుడు ఎవరో వీడియో తీశారని, తన భర్తకు తెలిస్తే చంపుతాడంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అంతలో అక్కడికి చేరుకున్న మంజుల, అమర్ తదితరులు యోగా గురువును బెదిరించి అతడి ఇంటికి తీసుకెళ్లారు. ఈ నెల 15వ తేదీ చెల్లుబాటు అయ్యేలా రూ.25 లక్షల విలువైన 2 చెక్కులు తీసుకున్నారు. మరో రూ.2 కోట్లు,రెండెకరాల భూమి రాసివ్వాలని డిమాండ్ చేశారు.ఎట్టకేలకు గోల్కొండ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read: ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News