Tuesday, April 23, 2024

డిజిపిని వదలని కేటుగాళ్లు

- Advertisement -
- Advertisement -

A gang that tried to commit scams in the name of DGP

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఓ వాట్సప్ నంబరుకు రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఫోటోను డిపిగా పెట్టి మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటుగాళ్లు ప్రముఖులకు, అధికారులకు సందేశాలు పంపించారు. ఈక్రమంలో 9785743029 నంబర్‌తో వాట్సా ప్ క్రియేట్ మోసాలకు పాల్పడేందుకు సిద్ధమవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర డిజిపి మ హేందర్‌రెడ్డి ఫొటోను డిపిగా పెట్టి పోలీసులు ఉన్నతాధికారులు,ప్రముఖులతో పా టు సామాన్యులకు సందేశాలు పంపించడం మొదలు పెట్టారు. తొలుత స్వచ్ఛంద సంస్థ పేరుతో సందేశాలు పంపిన నేరగాళ్లు ఆ లింకును తెరచి వివరాలు నమోదు చేయాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన డిజిపి అది తన నెంబర్ కాదని ఎవరూ స్పందించొద్దని తెలిపారు. వెంటనే ఈ విషయంపై అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆ నంబరును వెంటనే బ్లాక్ చేయించారు.

నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ నంబర్ తీసుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డిజిపి పేరిట మోసాలకు యత్నించిన ముఠా గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసు అధికారుల పేరుతో ఫేస్‌బుక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసే కేటుగాళ్లు తాజాగా డిజిపి పేరిట వాట్సప్‌ను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి సందేశాలకు ఎవరూ స్పందించ వద్దని ప్రజలకు పోలీసు బాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరస్థులు ప్రముఖులకు చెందిన సామాజిక మాధ్యమాలను హ్యాక్ చేయడం, నకిలీవి సృష్టించి డబ్బులు అడగడం వారికి పరిపాటిగా మారిందని వివరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారుల రహస్య వివరాలు తెలుసుకోవడానికి ఇలాంటి సందేశాలు పంపిస్తున్నారని ఆ ఉచ్చులో పడొద్దని పోలీసు బాసులు సూచిస్తున్నారు. నకిలీ ఖాతాలు, వాట్సాప్ డిపిలు, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని పోలీసులు సూచించారు. గతంలోనూ అదనపు డిజి స్వాతి లక్రా, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్‌తో పాటు పలువురు ఎసిపి, సిఐల పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News