Saturday, July 27, 2024

ఆక్స్‌ఫర్ట్‌లో ఘనంగా వనమహోత్సవం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ పాఠశాల ప్రాంగణంలో వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన జీవితంలో అడవుల ప్రా ముఖ్యతపై అవగాహన పెంచేందుకు 1950లో కె.ఎం.మున్షీ ప్రారంభించిన వన మహోత్సవాన్ని ఆక్స్‌ఫర్ట్ గ్రామర్ హైస్కూల్ యజమన్యాం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగ్యస్వామ్యం చేస్తూ విరివిరిగా మొక్కలను నాటడంతో పాటు చుట్టుపక్కల వారికి పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సోషల్ ఫారెస్ట్రీ), ట్రీ ప్రొటెక్షన్ కమిటీ ఇన్‌ఛార్జ్ చైర్మన్ జి. రామలింగం ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు.

ఈ సందర్భంగా జి. రామలింగం మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రయోజనాల కోసం అడవులను నరికివేయడం వల్ల భూమి మీది పచ్చదనం తగ్గడం వల్ల దాని ప్రభావం వాతావరణం పై పడి అనావృష్టికి దారి తీస్తుoదని అన్నారు. వర్షాలు హెచ్చు తగ్గులుగా పడడం, సకాలంలో కురవక పోవడం చెట్లను కొట్టి వేయడం ప్రధాన కారణమని తెలిపారు. ప్రతికూల పరిస్థితులను నివారించడానికి మన చుట్టూ ఉన్న వృక్ష సంపదను పరిరక్షించడంతో పాటు పచ్చదనాన్ని కాపాడుకోవడానికి వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడానికి కృషి చేయాలని ఉద్ఘాటించారు.

వనమహోత్సవం సందర్భంగా చెట్లను నాటడం వల్ల ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందించడం, ఆహార వనరుల ఉత్పత్తిని పెంచడం, ఉత్పాదకతను పెంచడానికి పొలాల చుట్టూ షెల్టర్ బెల్ట్‌లను సృష్టించడం, పశువులకు ఆహారం అందించడం, నేల క్షీణతను పరిరక్షించడంలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమoలో ఉపాధ్యక్షురాలు ఎం.ప్రార్థన,కరెస్పాండంట్ కె ప్రభాకర్ , ప్రధాన ఉపాధ్యాయురాలు రామాoజుల, ఫహ్మిద షామీన్ , ఫాతిమా ఖాజిమ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News