Saturday, June 1, 2024

ఎంఎల్‌ఎం కేసులో ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: తమ సంస్థలో చేరిన వారికి టూర్లు, బంగారు ఆభరణాలు తదితర వస్తువులు ఇస్తామని చెప్పి డబ్బులు డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తున్న ముగ్గురు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన రియాజుద్దిన్ అలియాస్ రియాజ్ అహ్మద్ పర్‌ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు. శకీలా, పూజా కుమారి నిందితుడికి సహకరిస్తున్నారు. పర్‌ఫెక్ట్ హెర్బల్ కేర్ పేరుతో నిందితుడు దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహిస్తున్నాడు. వాటిలో తమ వద్ద పలు స్కీంలు ఉన్నాయని వాటిలో చేరితే భారీగా లాభపడతారని నమ్మిస్తున్నాడు.

ఇందులో ఐడి స్కీం, పర్‌ఫెక్ట్ హెర్బల్ స్టోర్, పర్‌ఫెక్ట్ బజార్ పేరుతో మూడు స్కీంలను చెబుతున్నాడు. ఇందులో చేరిన వారితో మరికొందరిని చేర్పించేలా చేస్తున్నాడు. ఇలా మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తున్నాడు. నిందితుడిని నమ్మిన బాధితులు ఇప్పిటి వరకు రూ.200కోట్లు పెట్టుబడి పెట్టారు. వారిని ఆకర్శించేందుకు నిందితుడు దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లను ఓపెన్ చేసి వాటి ద్వారా డబ్బులు డిపాజిట్ చేసిన వారికి వస్తువులు అందిస్తున్నాడు. కొందరికి డిపాజిట్ చేసిన దానిని బట్టి టూర్లు, బంగారు ఆభరణాలు, కార్లు, బైక్‌లు ఇస్తామని నమ్మిస్తున్నాడు. ఇలా చాలామంది నగరానికి చెందిన వారు నష్టపోయారు. వారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. క్రైం, సిట్ డిసిపి శబరీష్ పర్యవేక్షణలో విజయ్‌పాల్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News