Saturday, April 20, 2024

కొవిడ్ లక్షణాలతో కొత్త ఫ్లూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్ లక్షణాలతో కూడిన తీవ్రస్థాయి ఫ్లూ దేశంలో పెరుగుతున్నాయి. దీనిని గమనించిన కేంద్రం ఇప్పుడు ఈ సరికొత్త ఇన్‌ఫ్లూయెంజా పై పాటించాల్సిన మార్గదర్శకాలను శనివారం వెలువరించింది. ఈ మధ్యకాలంలో దాదాపుగా ప్రతి పది మందిలో కనీ సం సగం మందికి ఇటువంటి ఫ్లూ సోకుతోంది. వీడని దగ్గు, ఎక్కువరోజులు ఉంటున్న జ్వరంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఇంతకు ముందు వచ్చిపోయే దగ్గు జలుబుతో కూడిన జ్వరానికి ఇప్పటి తీవ్రస్థాయి ఫ్లూజ్వరానికి చాలా తేడా ఉం టోంది. దేశం దాదాపు గా రెండేళ్ల పాటు కొవిడ్ మహమ్మారితో తల్లడిల్లి చితికిన తరువాత ఇ ప్పుడిప్పుడే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కోలుకుంటున్న దశలో ఇప్పుడు తలెత్తిన ఈ అనారోగ్య సమస్య రానురాను ఆరో గ్య సంక్షోభానికి దారితీసే విధంగా మారుతోందని వైద్య ఆరోగ్య నిపుణు లు హెచ్చరిస్తున్నారు. శీతాకాలం, వేసవికాలం సంధిదశలో ఈ సరికొత్త ఫ్లూ చోటుచేసుకుంది. అయితే ఈ ఫ్లూలో ఎక్కువగా జనానికి చు క్కలు చూపిన కరోనా లక్షణాలు ఉండడంతో మరిం త ఆందోళనకు దారితీస్తోంది.

ఈ సరికొత్త ఫ్లూపై దేశంలోని అధీకృత భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) ఓ కీలక ప్రకటన వెలువరించింది. ఇప్పుడు తలెత్తిన ఫ్లూ విపరీత పరిణామానికి ఇన్‌ఫ్లూయెంజా ఎ సబ్‌టైప్ అయిన హెచ్3ఎన్2 వైరస్ కారణం అని ఐసిఎంఆర్ తెలిపింది. దీనితో ఇప్పుడు వేవ్‌ల కమ్ముకుంటున్న జ్వరానికి వైరస్ ప్రక్రియనే కీలకమని స్పష్టం అయింది. ఈ వైరస్ వల్ల అత్యధిక సంఖ్య లో ఆసుపత్రుల పాలు కావల్సి వస్తోంది. ఇంతకు ముందుటి ఈ రకం వైరస్‌లతో పోలిస్తే ఇది గత రెండు మూడు నెలలుగా ఎక్కువగా వ్యాప్తి అవుతోందని నిపుణులు తెలిపారు. దగ్గు జ్వరం కొంత మేర జలుబు మిళితం అయి తాము బాధపడుతున్నామని జనం వైద్యుల వద్ద వాపోతున్నారు. ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటోంది. లక్షణాలు తీవ్రంగా నే ఉంటున్నాయి. పైగా వదలకుండా ఎక్కువకా లం ఈ అనారోగ్య లక్షణాలు మనిషిలో నిలిచిపోతున్నాయి. చికిత్స తరువాత రికవరీ అయినా వై రస్ లక్షణాలు దీని ప్రభావం పూర్తి స్థాయిలో అంతరించిపోవడం లేదని సిద్ధ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు.

ప్రాణాంతకం కాదు కానీ చికాకే
ఇప్పటి వైరస్ కారక జబ్బు మనిషికి ప్రాణాంతకం కాదు. అయితే మనిషిని ఓ పట్టాన కుదురుగా ఉండనివ్వని అనారోగ్య స్థితిని తెచ్చిపెడుతుంది. క్లినికల్ ట్రయల్ స్పెషలిస్టు అయిన డాక్టర్ అనిత రమేష్ దీని గురించి విశ్లేషించారు. దీని వల్ల ప్రాణాంతక ముప్పు ఏమీ ఉండదని, అయితే కొందరికి దీని వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని, దీనితో ఆసుపత్రులు పాలుకావల్సి వస్తుందని హెచ్చరించారు. కోవిడ్ తరహా లక్షణాలే దీని వల్ల తలెత్తుతున్నాయని, అయితే ఈ వైరస్ సోకిన వారు తమ వద్దకు రాగా పరీక్షలు జరిపితే కోవిడ్ ఏమీ లేదని తేలిందని వివరించారు.

మార్గదర్శకాలు వెలువరించిన ఐసిఎంఆర్
ఏదిపడితే ఆ గోళీలు మందులు వాడవద్దు

ప్రస్తుత అనారోగ్య విషమ పరిస్థితి నేపథ్యంలో ఐసిఎంఆర్ వెలువరించిన గైడ్‌లైన్స్‌లలో చేయాల్సిన చేయకూడని వాటి గురించి తెలిపారు. వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక ఈ రకం జబ్బు అంటే తరచూ దగ్గు జ్వరం వస్తూ ఉండటంతో జనం విచక్షణారహితంగా సొంతంగా మందులు తీసుకోరాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలిపింది. దీని వల్ల తాత్కాలిక నివారణ సంగతి పక్కనపెడితే దీర్ఘకాలిక లేదా తదనంతర విపరీత పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డాక్టర్లు కేవలం వైరస్ సంబంధిత చికిత్సకు దిగాలి తప్పితే ఎక్కువగా యాంటిబయాటిక్స్ మందులు రాయరాదని తెలిపారు. కోవిడ్ దశలో మనం ఎక్కువగా అజిత్రోమైసిన్ , ఐవెర్మెక్టిన్ వాడారు. దీని వల్ల రోగనిరోధకత పెరిగింది. వైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్ సోకిందా లేదా అనేది నిర్థారించుకున్న తరువాతనే అవసరం అయితేనే యాంటిబయాటిక్స్ ఇవ్వాలని ఐఎంఎ స్పష్టం చేసింది.

వాయుకాలుష్యంతో వైరల్ ఫివర్లు
చివరికి శ్వాసకోశానికి ముప్పు

సీజనల్ మార్పులతో తలెత్తే వైరస్‌ల క్రమంలో వచ్చేపడే ఇప్పటి ఫ్లూ వంటి వైరస్‌లు ఎక్కువగా వాయుకాలుష్యంతో విజృంభిస్తున్నాయి. ఎక్కువగా ఈ సమస్య 15 సంవత్సరాల లోపు లేదా 50 సంవత్సరాలు పైబడి ఉండే వారిలో తలెత్తుతోంది. వీరికి ఈ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకితే తలెత్తే జ్వరం వీడని దగ్గుతో అసలుకే బలహీనంగా ఉండే శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయని నిపుణులు తెలిపారు. జనం తమకు ఫ్లూ వంటి ఈ జబ్బు తొందరగా నయం కావాలని ఎక్కువగా అజిత్రోమైసిన్ లేదా అమోక్సిక్లావ్ వంటివి ఇవ్వాలని డాక్టర్లను లేదా నేరుగా మెడికల్ షాప్‌లను సంప్రదిస్తున్నారు. తాత్కాలిక ఉపశమనాలకు వెతుక్కుంటున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం మానివేయాలని ఐఎంఐ సంబంధిత యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కమిటీ సూచించింది.

అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటూ పోతే చివరికి అత్యవసరం అయినప్పుడు ఇవి మనిషిలో పనిచేయనిస్థితిని కల్పిస్తాయని వైద్యులు గుర్తించాలని ఈ రోగనిరోధక విషయాల కమిటీ తెలిపింది. శ్వాసకోశ సంబంధిత వైరస్‌ల దుష్ప్రభావం గురించి ఇప్పుడు వైరస్ పరిశోధనలు నిర్థారణల సంబంధిత లాబ్స్ నెట్‌వర్క్‌లో పరిశోధనలు తీవ్రతరం అయ్యాయి. మనిషిలో రోగనిరోధక శక్తిని క్రమపద్ధతిలో సహజ విధానాల ద్వారా పెంపొందింపచేసుకోవల్సి ఉంటుంది. మందుల వాడకం ద్వారా సంక్రమించే ఇమ్యూనిటి కొన్నివేళల్లో విపరీతాలకు దారితీస్తుందని నిపుణులు తెలిపారు. డయోరియా నివారణ చికిత్సకు వాడే యాంటిబయాటిక్స్ అయిన అమోక్సిసిలిన్ , నోర్ఫోలోక్సాసిస్, లెవోఫ్లాక్సాసిన్ లను చీటికిమాటికి వాడుతూ ఉండటం వల్ల ఇది దుర్వినియోగానికి దారితీస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News