Friday, September 22, 2023

గీతమ్ విద్యార్థి వంశీకి అరుదైన రికార్డ్

- Advertisement -
- Advertisement -

అమీన్‌పూర్: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో సిఎస్‌ఈ (ఏఐ అండ్ ఎంఎల్) రెండో ఏడాది చదుతున్న విద్యార్థి దేవరాజు వంశీ కృష్ణంరా జు అరుదైన ఘనత సాధించి హార్వర్డ్‌ను ఆకర్షించా రు. ‘అధ్విక’ పేరుతో కృత్రిమ మేథ (ఏఐ) సంభాష ణ బాట్ప చేసిన కృషికి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్, లం డన్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని గీ తం అధ్యాపకులు డాక్టర్ అనిత, డాక్టర్ త్రినాథరావులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘అధ్విక కృత్రిమ మేథ సంభాషణ బాట్ అనేది సహజమైన, ఆకర్షణీయమైన సంభాషణల ను సులభతరం చేయడానికి అత్యాధునిక సాంకేతిక ను ప్రభావితం చేసే ఒక గొప్ప ఆవిష్కరణ. ఇది తనదైన సొంత అధునాతన భాషా మోడల్‌తో కూడిన అ ద్భుతమైన వాయిస్ అసిస్టెంట్. ఇది మన పనులను నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి రూపొందించారు. విస్తృతమైన సామర్థ్యాలతో, వివిధ పనులను సులభతరం చేయడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అధ్విక మన దినచర్యలో సహకరిస్తుంది’ అని వారు వివరించారు.

ఈ-మెయిల్ కంపోజ్ చే యడం, పంపడం నుంచి రిమెండర్లను సెట్ చే యడం, చేయాల్సిన పనులు జాబితాను రూపొందించడం వరకు అధ్విక ఓ విశ్వసనీయ సహచరుడన్నారు. ప్రతి పదాన్ని చూసి టెస్టుచేసే విధానానికి స్వస్తిపలికి, మంచి పదాలతో రాయగలిగేందుకు ఇ ది సహకరిస్తుందని వారు తెలిపారు. వర్డ్ డాక్యుమె ంట్ లేదా పీడీఎఫ్ అయినా, మన ఆలోచనలకు అ నుగుణంగా అధ్విక వాటిని చక్కగా, నిర్మాణాత్మకం గా, వృత్తిపరంగా ఫార్మాట్ చేసిన ఫెళ్లగా మార్చి, మ న విలువైన సమయం, కృషిని ఆదా చేస్తుందని గీత ం అధ్యాపకులు వివరించారు. ముఖ్యమైన సమావేశాలు లేదా గడువులను మనం మర్చిపోకుండా అధ్విక గుర్తుచేస్తుందని, దాని సహజమైన ఇంటర్ఫేస్, ఇంటెలిజెంట్ అల్గారిథమ్లతో మన ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండడమే గాక, గరిష్ట ఉత్పాదకత కోసం మన రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.

అధ్విక నిరంతరం మన పరస్పర చర్యల నుంచి నేర్చుకుంటుంది, కాలక్ర మేణా మన ప్రత్యేక రచనా శైలి, పదజాలం, ప్రా ధాన్యతలను అర్థం చేసుకుంటుందని, ఇది మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవనానికి ఓ తోడుగా పనిచేస్తుందని అధ్యాపకులు వివరించారు. తాను ఈ స్థా యి ప్రశంస అందుకోవడానికి నిరంతరం తనకు మద్దతుగా నిలిచిన అధ్యాపకులకు వంశీ కృ తజ్ఞత లు తెలియజేయడమే గాక, అమూల్య మార్గదర్శ నం, ప్రోత్సాహం లేకుండా ఉంటే, ఈ విజయం సా ధ్యమయ్యేది కాదని అన్నట్టు వారు తెలియజేశా రు. హార్వర్డ్ వరల్ రికార్డ్ పొందిన వంశీ కృష్ణంరాజును గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొ ఫెసర్ డిఎ స్రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరెక్టర్ ప్రొ ఫెసర్ రామశాస్త్రి, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీతారామయ్య, సిఎస్‌ఈ విభాగాధిపతి సుదీప్ సుకుమారన్ కడవిల్, రెసిడెంట్ డెరైక్టర్ డివివిఎస్‌ఆర్ వర్మ లు ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News