Sunday, April 28, 2024

తెలంగాణలో రెండు ఎంపి స్థానాల్లో ఆప్ పోటీ : డా. సుధాకర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టి (ఆప్) తెలంగాణా లో రెండు పార్లమెంట్ నియోజక వర్గాల్లో పొటీ చేయనుంది. ఆమ్ ఆద్మీ పార్టి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం ఆదివారం ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అద్యక్షతన జూమ్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఈడి, సిబిఐ లను ఉపయోగించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రధాని మోడీ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. అరవింద్ కేజ్రివాల్ ను అరెస్టు చేస్తే ఇండియా కూటమి దెబ్బ తింటుందని మోడీ కలలు కంటున్నారని, కాని మోడీ కలలు కల్లలు అవుతాయని డా. సుధాకర్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని డాక్టర్ సుధాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అభ్యర్థులు గత పార్లమెంటు ఎన్నికలల్లో చేవెళ్ళ పార్లమెంటు నియోజక వర్గం నుండి వెంకట రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజక వర్గం నుండి సుధాకిరణ్ పోటీ చేసి గణనీయమయిన ఓట్లను సాధించినట్లు తెలిపారు. ఈ సారి పార్లమెంటు ఎన్నికలలో చేవెళ్ళ, మల్కాజ్ గిరి, పార్లమెంటు నియోజక వర్గాల నుండి పోటికి ఆమ్ ఆద్మీ పార్టి తెలంగాణా కమిటీ సిద్దంగా ఉందని కేంద్ర పార్టి భాద్యులకి తెలియ చేయడం జరిగిందన్నారు. ఇండియా అలయన్స్ లో ఆ నియోజకవర్గాల ను కేటాయించితే పోటీ చేస్తామని, కాంగ్రెస్ పార్టీ, మిగిలిన అలయన్స్ పార్టీ లతో కలిసి పోటీ చేసి తెలంగాణా రాష్ట్రం లో బిజెపిని నిలువ రిస్తామని డాక్టర్ సుధాకర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News