Friday, May 10, 2024

సాంకేతిక అభివృద్ది, కొత్త ఆవిష్కరణలను వన్యప్రాణుల రక్షణ కోసం వాడాలి

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందేశంలో మంత్రి కొండా సురేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక అభివృద్ది, కొత్త ఆవిష్కరణలను వన్యప్రాణుల రక్షణ కోసం వాడాలనే సంకల్పంతో ఈ యేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని (వరల్డ్ వైల్డ్ లైఫ్ డే) జరుపుకుంటున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని, వన్యప్రాణుల మనుగడ, రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ప్రతీ యేటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

జీవ వైవిధ్యం, అన్ని ప్రాణుల మనుగడే సమతుల్యమైన ప్రకృతికి జీవనాధారం వణ్య ప్రాణులని వెల్లడించారు. కాగా అభివృద్ది పేరిట అడవులు, ఇతర జంతుజాలం పట్ల మనుషుల వైఖరిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని, దీంతో వన్యప్రాణుల మనుగడపై తీవ్ర ఒత్తిడి చోటు చేసుకుంటోందన్నారు. మనతో పాటు రానున్న తరాలకు కూడా నివాసయోగ్యమైన పరిసరాలు కావాలంటే అన్ని జీవరాసుల మనుగడ, సహజీవన సూత్రాన్ని కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా జంతువులు, పక్షులు, వృక్ష జాతులతో కూడిన పర్యావరణ రక్షణ అందరి సంకల్పం కావాలని పేర్కొన్నారు. అప్పుడే మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోందన్నారు.

జంతు ఆవాసాల్లో మనుషుల చొరబాట్ల వల్లే ఈ సమస్య వస్తోందన్నారు. దీనిని వీలైనంతగా తగ్గించటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే మనుషుల నిర్లక్ష్యంతో జరుగుతున్న అటవీ అగ్నిప్రమాదాలను నివారించాలని, అటవీ మార్గాల్లో ప్రయాణాల్లో ప్రతీ ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎండాకాలం జంతువులు, పక్షుల నీటి వసతికి వీలైనంతగా అందరూ సహకరించాలని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అటవీ నేరాల అదుపుకు, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ నివారణకు ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత, జంతుజాలం, మనుషుల జీవనం పరస్పర ఆధారాలని పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా మిగతా వాటి జీవనంపై ప్రభావం పడుతుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని, అందుకు అనుగుణంగా బాధ్యతతో మెలగాలని ఆశిస్తున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News