Tuesday, October 15, 2024

నాకు చెప్పకుండానే విడాకులు ప్రకటించాడు: జయం రవిపై భార్య షాకింగ్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

తమిళ హీరో జయం రవిపై భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనకు చెప్పకుండానే విడిపోతున్నామని జయం రవి విడాకుల ప్రకటన చేశారని ఆర్తి అన్నారు. సమస్యలు పరిష్కరించుకోవాలని ఎన్నో సార్లు ప్రయత్నించానని చెప్పారు. తనకు తెలియకుండా, తన అంగీకారం లేకుండా విడాకులు తీసుకున్నట్లు రవి వెల్లడించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, రెండు రోజుల క్రితం జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నామని చెప్పారు. దాదాపు 15ఏళ్లపాటు అన్యోన్య దంపతులుగా ఉన్న జయం రవి-ఆర్తి విడిపోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆర్తి తన ఇన్ స్టాగ్రామ్ లో భర్త జయం రవి ఫోటోలను తొలగించడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News