Saturday, September 23, 2023

సూపర్‌విన్‌కు ఎబి డివిలియర్స్, పూజా హెగ్డె ప్రచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఆన్‌లైన్ గేమింగ్ రంగమైన సూపర్‌విన్‌లోకి దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్, ప్రముఖ నటి పూజా హెగ్డేలు కొత్తగా ప్రవేశించారు. ఎబిడి, పూజా హెగ్డెలు సూపర్‌విన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సూపర్‌విన్ అధికార ప్రతినిధి అన్నారు. వీరి భాగస్వామ్యం గత నెలలో ప్రారంభించిన సూపర్‌విన్‌కి సరైన మొదటి అడుగు, ఆన్‌లైన్ గేమింగ్ అనేది వేగంగా ప్రజలు క్రీడలను ఆస్వాదించే విధానంలో అంతర్భాగంగా మారుతోంది, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది.

అభిమానులు ఇప్పుడు స్టాండ్స్‌లో కూర్చున్న ప్రేక్షకులుగా కాకుండా మైదానంలో ఏమి జరుగుతుందో దానిలో వాటాదారులుగా భావించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ 360గా పేరుగాంచిన దిగ్గజ క్రికెటర్ ఎబిడి, సూపర్‌విన్‌తో తన భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డివిలియర్స్ 2004 నుండి 2018 వరకు దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో అన్ని ఫార్మాట్లలో రాణించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోసం అనేక చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. పూజా హెగ్డె అన్ని భాషల్లో నటిస్తూ దేశంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె సూపర్‌విన్‌తో భాగస్వామ్యం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News