Monday, April 29, 2024

భావి ఇంజినీర్ల ఆయువు తీసిన అతివేగం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం, -ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన క్వాలీస్ వాహనం
ముగ్గురు మృతి.. ఎనిమిది మందికి గాయాలు , నలుగురి పరిస్థితి విషమం హైద్రాబాద్ తరలింపు

మన తెలంగాణ / చిన్నకోడూరు: సి ద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు విద్యార్థు లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్రగాయాలు అయ్యా యి. గాయపడిన వారిలో నలుగురి ప రిస్థితి విషమంగా ఉంది. సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. సిద్దిపేట పట్టణంలోని ఇందూ రు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బీ టెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కరీంనగర్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలలో సెకండ్ సెమిస్టర్ పరీక్షలు రా యమానికి వెళ్లారు.

రోజు బస్సులో వె ళ్లే వారంతా చివరి పరీక్ష కావడంతో ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చే సుకొని కరీంనగర్‌కు వెళ్లి పరీక్ష రాసి తిరిగి సిద్దిపేటకు వస్తున్న క్రమంలో చిన్నకోడూరు మండలం అనంతసాగ ర్ గ్రామ శివారుకు రాగానే విద్యార్థు లు ప్రయాణిస్తున్న క్వాలీస్ వాహనం ఆగి ఉన్న టీఎస్ 36టీఎ 4688 నెం బర్‌గల లారీని వాహనం వేగంగా వ చ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యా లీస్‌లో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కళా విపిన్ చంద్ర (19) , నేతి నాగరాజు (20), పయ్యావుల గ్రీ ష్మ (19)లు అక్కడికక్కడే మృతి చెం దారు.

బుద్ధ్ద సాయికిరణ్ (18), తౌటి దేవచంద్ (19), కర్రె రాజు (19), కొర్తివాడ చైతన్య (18), బెజగామ న మ్రత (18), ముత్యాల ప్రవళిక (19) , చిటుకుల రోహిత్‌రెడ్డి (19), జోరబొంతల సాయికిరణ్ (19)లు తీవ్రం గా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో హుటాహుటిన సిద్దిపేట ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించగా నమ్ర త, చైతన్య, దేవచంద్, ప్రవళ్లికల పరిస్ధితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన నలుగురికి సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో వై ద్యం అందిస్తున్నారు. క్వాలీస్ వాహ నం అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో బాధితులను బయటకు తీయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. స్ధానికులు గడ్డ పారలు తెచ్చి వాహనం డో ర్లను పగుల గొట్టి బాధితులను బయటకు తీశారు.

మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన వివరాలు తెలుసుకున్న మంత్రి ప్రమాద సంఘటన పై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన బాధాకరమన్నారు. ముగ్గురు విద్యార్థుల మృతి తీవ్రంగా కలిచి వేసిందన్నారు. వారి మృతి పట్ల సంతాపాన్ని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానన్నారు.. మిగతా 8 మందిలో నలుగురు తీవ్రంగా గాయాలయ్యాయని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వైద్యులను అదేశించారు. అదేవిధంగా మిగతా విద్యార్థులకు సిద్దిపేట వైద్య కళాశాల ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబాలతో మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడి అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని హమీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News