Tuesday, October 15, 2024

అభిమన్యు సెంచరీ… ఇండియా బి 309/7

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా బి, ఇండియా సి మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఇండియా బి జట్టు 101 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇండియా సి జట్టు 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. అభిమన్యు ఈశ్వరన్ భారీ సెంచరీతో కదంతొక్కాడు. అభిమన్యు 262 బంతుల్లో 143 పరుగులో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా బి జట్టు బ్యాట్స్‌మెన్లలో ఎన్ జగదీశన్(70), రవిశ్రీనివాసన్ సాయి కిశోర్(21), సర్ఫరాజ్ ఖాన్(16), వాషింగ్టన్ సుందర్ (13), రింకు సింగ్(06), నితీశ్ రెడ్డి(02), ముషీర్ ఖాన్(01) పరుగులు చేశారు. క్రీజులో అభిమన్యు (143), రాహుల్ చాహర్(18) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా సి జట్టు బౌలర్లలో అన్షుల్ కంబోజ్ ఐదు వికెట్లు తీయగా విజయ్ కుమార్ వైశ్యాక్, మయాంక్ మర్కండే చెరో ఒక వికెట్ తీశారు.
ఇండియా సి జట్టు తొలి ఇన్నింగ్స్: 525

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News