Sunday, October 6, 2024

రేవంత్ ను తిడితే నాలుక కోస్తాం: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడగొట్టాలని బిఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. శనివారం గాంధీ భవన్ నుంచి జగ్గారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ల నాలుకలు కోస్తారని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కానీ సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామన్నారు. బిఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ ప్రజల మూడ్‌ను ఖరాబ్ చేశారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. వినాయకుడి నవరాత్రులను ఆస్వాదించకుండా చేశారని, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావుకు బుర్ర పని చేయడం లేదని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అయిన తరువాత ఇప్పుడు ప్రాంతీయవాదం ఎందుకు వచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News