Monday, May 6, 2024

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఎసిబి సోదాలు

- Advertisement -
- Advertisement -

వరంగల్: మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఎసిబి సోదాలు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గత నెల 22న లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. హన్మకోండలోని ఆమె నివాసంతో పాటు తస్లీమా భర్త నివాసముంటున్న సూర్యాపేటలోనూ ఎసిబి సోదాలు చేపట్టింది. ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది.  మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ. 19,200 ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేష్ ద్వారా తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి 108 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్ కోసం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే గజానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 108 ఉండగా అందుకు గజానికి రూ.200 ఇస్తే రిజిస్ట్రేషన్ ఆవుతుందని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ స్పష్టం చేశారు. అలా అయితేనే స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ అవుతుందని పేర్కొన్నారు. అయితే అంత డబ్బు రిజిస్ట్రార్‌కు ఇవ్వడానికి ఇష్టపడని హరీష్ వరంగల్‌లోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే శుక్రవారం తమ సూచనల మేరకు తిరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను ఆశ్రయించి గజానికి రెండు వందలు కాదని రూ. 150 ఇస్తానని చెప్పి బేరమాడాడు.  రూ. 19,200 ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేష్‌కు ఇస్తే ఆయనే అన్ని చూసుకుంటాడని తెలిపినట్లు వివరించారు. ఆమె కోరిన డబ్బును సబ్ రిజిస్ట్రార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఆలేటి వెంకటేష్‌కు ఇస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అలాగే కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో పాటు వెంకట్ వద్ద ఉన్న లెక్కలేని నగదు రూ. 1లక్షా 72 వేల నగదును కూడా స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్ట్రార్ తస్లామా మహ్మద్,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News