Sunday, June 4, 2023

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండలంలోని సూరారంకు చెందిన పాలబోయిన కుమార్ రేకుల ఇల్లు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధం అయిన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానిక ఏఎస్సై వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ అతని ముగ్గురు అన్నదమ్ములు ఒక ఇంట్లోనే వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. కుమార్ కుటుంబం ఇంటి ముందు రేకులు వేసుకుని ఉంటుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం వ్యవసాయం పనులకు వెళ్ళారు.

ఇంట్లో ఉన్న పొయ్యిలో నిప్పు సరిగా ఆర్పక పోవడంలో అక్కడే దండెంపై ఆరేసిన చీర పొయ్యిలో పడి రగులుకుని మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకుని బయటికి రావడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పారు. అప్పటికే ఇంట్లోని దుస్తులతో పాటు పలు వస్తువులు కాలిపోయాయి. సుమారుగా రూ.60 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News